Skip to main content

Namaste NRI

భవానీ వార్డ్‌ వాళ్లకు కూడా నచ్చుతుంది : దర్శకుడు నరసింహ

గాయత్రీ గుప్తా, గణేష్‌ రెడ్డి, పూజా కేంద్రే, సాయిసతీష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం భవానీ వార్డ్‌. జీవీ నరసింహా దర్శకత్వం.  ఈ చిత్రాన్ని కల్యాణ్‌ చక్రవర్తి, చంద్రకాంత్‌ సోలంకి నిర్మిస్తున్నారు. ఈ  చిత్రం  ఫస్ట్‌ లుక్‌ ను లాంచ్‌ చేశారు. దర్శకుడు నరసింహ  మాట్లాడుతూ విభిన్న కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. చక్కటి వినోదంతో పాటు సెంటిమెంట్‌తో ఆకట్టుకుంటుంది అన్నారు. భవానీ వార్డ్‌ హారర్‌ చిత్రం అయిన ప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించాను. హారర్‌ సినిమాలు ఇష్టపడేవారికి బాగా నచ్చుతుం ది అని అన్నారు. తన పాత్ర భిన్న కోణాల్లో సాగుతుందని, అభినయానికి ఆస్కారం ఉన్న పాత్ర దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని గాయత్రీ గుప్తా చెప్పింది. ఈ సినిమా ద్వారా తనకు మళ్లీ నటుడిగా అవకాశమి చ్చారని, మంచి పాత్రను పోషించానని చిత్ర పీఆర్వో, నటుడు సాయి సతీష్‌ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అరవింద్‌ బి, సంగీతం: సోల్మోన్‌రాజ్‌, నిర్మాణ సంస్థ: అవి క్రియేషన్స్‌, విభు ప్రొడక్షన్స్‌, దర్శకత్వం: జీవీ నరసింహా.

Social Share Spread Message

Latest News