Namaste NRI

ఐదు భాషల్లో సరిపోదా…

నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సరిపోదా శనివారం. వివేక్‌ ఆత్రేయ దర్శకుడు. డీవీవీ ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుళ్‌ మోహన్‌, ఎస్‌.జె. సూర్య తదితరులు నటిస్తున్నారు.   ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇటీవలే విడుద లైన టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. కోపాన్ని ఓ క్రమపద్ధతిలో వాడుకునే వ్యక్తిగా ఇందులో నాని కనిపిస్తారు. శనివారాల్లో మాత్రమే శత్రువులను వేటాడే పవర్‌ఫుల్‌ పాత్ర ఇందులో ఆయనది. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 29న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రానికి కెమెరా: మురళి.జి, సంగీతం: జేక్స్‌ బిజోయ్‌, రచన-దర్శకత్వం: వివేక్‌ ఆత్రేయ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events