గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ను కష్టాలు చుట్టుముడుతున్నాయి. జెమినీ ఏఐ ఇమేజ్ జనరేటర్ సేవల నిలిపివేత ప్రభావం ఆయనపై పడుతున్నది. దీంతో పిచాయ్ తన బాధ్యతల నుంచి తప్పుకోవాలనే ఒత్తిడి పెరుగుతున్నది. గూగుల్ మేనేజింగ్ బోర్డు కూడా పిచాయ్ను తప్పించాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏఐ మార్కెట్లో నిలదొక్కుకోవాలనే లక్ష్యంతో గూగుల్ పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి ఏఐ ఆధారిత జెమిని ఇమేజ్ జెనెరేటర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే దీనితో సృష్టిస్తున్న చిత్రాల్లో పెద్ద ఎత్తున తప్పులు ఉంటున్నందున జెమిని టూల్ సేవలను గూగుల్ నిలిపివేసింది. ఈ ప్రభావం తో గూగుల్ స్టాక్స్ పెద్ద ఎత్తున నష్టపోతున్నాయి. దీంతో సుందర్ పిచాయ్ సహా గూగుల్లో కీలక స్థానాల్లో ఉన్న వారిని తప్పించే అంశాన్ని మేనేజింగ్ బోర్డు పరిశీలిస్తున్నదని సమాచారం.














