Skip to main content

Namaste NRI

మహాశివరాత్రిని సందర్భంగా…కన్నప్ప ఫస్ట్‌ లుక్‌

మంచు విష్ణు టైటిల్‌ రోల్‌ని పోషిస్తున్న చిత్రం కన్నప్ప. శ్రీకాళహస్తి స్థలపురాణం ఆధారంగా తెరకెక్కిస్తు న్నారు. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకుడు. మహాశివరాత్రిని పురస్కరించుకొని కన్నప్ప ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో మంచు ధనుస్సును చేతబూని విల్లంబులు సంధిస్తూ కనిపిస్తున్నారు. ఓ ధైర్యవంతుడైన యోధుడు, శివుడి అపరభక్తుడైన కన్నప్ప కథ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తినింపుతుంది. భక్తిరసప్రధానంగా అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేస్తాం అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో మోహన్‌లాల్‌, మోహన్‌బాబు, ప్రభాస్‌, శరత్‌కుమార్‌ వంటి అగ్ర తారలు భాగమవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా రెండో షెడ్యూల్‌ చిత్రీకరణ న్యూజిలాండ్‌లో జరుగుతున్నది.

Social Share Spread Message

Latest News