Namaste NRI

ఓదెల 2లో శివశక్తిగా తమన్నా ఫస్ట్‌లుక్‌

తమన్నా భాటియా శివశక్తిగా పవర్‌ఫుల్‌ రోల్‌లో కనిపించనుంది. ఓదెల 2లో శివశక్తిగా ఆమె ఫస్ట్‌లుక్‌ను మహా శివరాత్రి సందర్భంగా చిత్రబృందం విడుదల చేశారు. ఈ పాత్రకోసం తమన్నా పూర్తిగా ట్రాన్స్‌ఫార్మేషన్‌ అయ్యారని, నాగసాదువు రూపంలో ఓ చేత దండం, మరో చేత ఢమరుకం, నుదిటిపై పసుపుకుంకుమలతో శివశక్తిగా తమన్నాను చూస్తుంటే థియేటర్లలో గూజ్‌బబ్స్‌ గ్యారెంటీ అని చిత్ర దర్శకుడు అశోక్‌ తేజ చెప్పారు.

కాశీ ఘాట్‌లపై నడుస్తూ కళ్లు మూసుకుని దేవుడ్ని ప్రార్థిస్తున్న రూపం ఆమె కెరీర్‌లోనే ప్రత్యేకమని, ఇది తమన్నా నుంచి ఎవరూ ఊహించని అవతారమని, ఓదెల 2 గ్రామ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్టశక్తుల నుంచి ఎలా కాపాడాడనే అంశాలు ఇందులో అద్భుతంగా ఉండబోతున్నాయని ఈ సినిమా క్రియేటర్‌గా వ్యవహరిస్తున్న సంపత్‌నంది తెలిపారు.  హెబ్బాపటేల్‌, వశిష్ఠ ఎన్‌ సింహా ముఖ్యతారాగణంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి కెమెరా: సౌందర్‌ రాజన్‌ ఎస్‌., సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌, నిర్మాత: డి.మధు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events