Namaste NRI

నందమూరి బాలకృష్ణ ఎన్‌బీకే 109 గ్లింప్స్ విడుదల

అగ్ర కథానాయకుడు బాలకృష్ణ కెరీర్‌లో దూసుకుపోతున్నారు. దీంతో ఎన్‌బీకే109 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఆయన తాజా చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి.  బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు.  మహాశివరాత్రిని పురస్కరించుకొని ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో బాలకృష్ణ పక్కా మాస్‌ అవతారంలో పవర్‌ఫుల్‌గా కనిపించారు. సింహం నక్కల మీదకు వస్తే వార్‌ అవ్వదురా లఫూట్‌. ఇట్స్‌ కాల్డ్‌ హంటింగ్‌ అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంది. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా భారీ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విజయ్‌ కార్తీక్‌, సంగీతం: తమన్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: అవినాష్‌ కొల్లా, దర్శకత్వం: బాబీ కొల్లి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events