Skip to main content

Namaste NRI

దేవర నార్త్‌ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం దేవర. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ పతాకాలపై సుధాకర్‌, హరికృష్ణ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీకపూర్‌ కథానా యికగా నటిస్తుండగా, సైఫ్‌అలీఖాన్‌ కీలక పాత్రలో కనిపంచనున్నారు. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంతం నేపథ్యంలో హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తు న్నారు. ఈ సినిమా గురించి బాలీవు డ్‌ ప్రేక్షకులకు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఉత్తరాది డిస్ట్రిబ్యూషన్‌ హక్కులను ప్రము ఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌ సొంతం చేసుకుంది. నిర్మాతలు కరణ్‌జోహార్‌, అనిల్‌ తండానీ నార్త్‌లో రిలీజ్‌ చేయబోతున్నారు. నార్త్‌ బెల్ట్‌లో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నామని దర్శక నిర్మాత కరణ్‌జోహార్‌ పేర్కొన్నారు.  దసరా కానుకగా అక్టోబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరకర్త.

Social Share Spread Message

Latest News