Skip to main content

Namaste NRI

అమెరికాలో భారత సంతతి మహిళ అరెస్టు

స్థానిక అధికారులను చంపేస్తానని బెదిరించిన భారతీయ సంతతి మహిళను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాద స్థాయిలో బెదిరింపులకు దిగిన ఈ మహిళను రిద్థి పటేల్‌గా గుర్తించారు. ఇటీవల కాలిఫోర్నియాలోని బేకర్స్‌ఫీల్డ్ నగర పాలక మండలి సమావేశం జరిగింది. ఈ దశలో ఈ మహిళ మేయర్‌ను ఉద్ధేశించి ఏకంగా చంపేస్తానని బెదిరించినట్లు నిర్థారణ అయింది. అమెరికా పట్ల ఆమె ఆగ్రహానికి కారణం ఉంది. ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలో కాల్పుల విరమణ తీర్మానానికి అమెరికా మద్దతు ప్రకటించకపోవడం పట్ల ఆమె ఈ సిటీ కౌన్సిల్ సభలో మండిపడ్డారని వెల్లడైంది. మేయర్ ఇతర ఉన్నత స్థాయి వారు ఎందుకు దీనిపై స్పందించడం లేదని వారిని చంపినా పాపం కాదని చెప్పడం వివాదాస్పదం అయింది. చివరికి ఆమె అరెస్టుకు దారితీసింది.

Social Share Spread Message

Latest News