Skip to main content

Namaste NRI

ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌కు ప్రవాసీయులు మద్దతు: గల్ఫ్ ఐక్య వేదిక  

గల్ఫ్ దేశాల్లోని ప్రవాసీ భారతీయుల కోసం నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు ధర్మపూరి అర్వింద్ అండగా నిలిచారని గల్ఫ్ ఐక్య వేదిక స్పష్టం చేసింది. నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మళ్లీ బరిలో దిగుతున్న అర్వింద్‌ను మరోసారి గెలిపించి, పార్లమెంట్‌కు పంపాలని ప్రవాసీయులకు, వారి కుటుం బాలకు గల్ఫ్ ఐక్య వేదిక విజ్జప్తి చేసింది. జగిత్యాలలో గల్ఫ్ ఐక్య వేదిక కన్వీనర్ వంశీ గౌడ్ అధ్వర్యంలో ప్రతినిధులు గాజుల సంపత్ కుమార్, మధు చిట్ల, ఆశోక్ కొట్టాల, వసంత్ రెడ్డి, ఆర్మూర్ శ్రీకాంత్, బోరగళ్ళ రమేశ్ తదితరులు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌కు ప్రవాసీయులు మద్దతు ఇవ్వాలని కోరారు.

కరోనా కష్ట కాలంలో ఎంపీగా ధర్మపూరి అర్వింద్  ప్రవాసీయులకు అందించిన సేవలను ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారని తెలిపారు. కరోనా రోగుల కోసం స్వంత నిధులతో క్వారంటైన్ వసతిని ఏర్పాటు చేసి, ప్రవాసీయులను ఆదుకోన్న విషయం మరువరాదన్నారు. ప్రవాసీయులకు స్వంత నగదుతో విమాన టిక్కేట్లు కొనుగోలు చేసి ఇచ్చారని వారు తెలిపారు. ఎడారి దేశంలోని ప్రవాసీ భారతీ యుల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి సహాయ సహకారాలు అందిస్తున్నారని వివరించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events