Skip to main content

Namaste NRI

నిజ్జర్‌ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్ట్‌

 ఖలిస్థాన్‌ వేర్పాటువాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో ముగ్గురు భారత పౌరులను కెనడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిజ్జర్‌ హత్య కోసం భారత్‌ ఏర్పాటుచేసినట్టుగా చెబుతున్న హిట్‌స్వాడ్‌లో వీరు సభ్యులని తెలిసింది.   నిజ్జర్‌ హత్యలో భారత్‌ ప్రమేయం ఉందని, భారత్‌ ఏజెంట్లే అతడిని హతమార్చారంటూ గత ఏడాది కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపించిన క్రమంలో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నా యి. కెనడా ఆరోపణలు అర్థం లేనివి, ప్రేరేపితమైనవని భారత్‌ ఖండించింది. దీనిపై దర్యాప్తు చేస్తున్న రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీసులు నిజ్జర్‌ హత్యకు కుట్ర పన్నిన హిట్‌ స్కాడ్‌ సభ్యులను గుర్తించి కొందరిని అరెస్ట్‌ చేసినట్టు కెనడా బీబీసీ ప్రకటించింది. నిందితులను కొన్ని నెలల క్రితమే గుర్తించినా వారి కదలికలపై నిఘా ఉంచి పూర్తి ఆధారాలు సేకరించినట్టు తెలిపింది. గత ఏడాది జూన్‌ 18న సాయంత్రం సర్రేలోని సిక్కు గురుద్వార్‌లో ప్రార్థనలు చేసి వస్తున్న నిజ్జర్‌ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు.

Social Share Spread Message

Latest News