Skip to main content

Namaste NRI

ఆకట్టుకుంటున్న పవన్ కుమార్ కొత్తూరి.. యావరేజ్ స్టూడెంట్ నాని ఫస్ట్ లుక్

పవన్‌ కుమార్‌ కొత్తూరి హీరోగా, స్వీయ దర్శకనిర్మాణంలో  నటిస్తున్న చిత్రం యావరేజ్‌ స్టూడెంట్‌ నాని. శ్రీనీలకంఠ మహాదేవ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్నది. ఈ చిత్రంలో స్నేహ, సాహిబా భాసిన్‌, వివియాసంత్‌ తదితరులు నటిస్తు న్నారు.  ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. హీరో, దర్శకుడు పవన్‌కుమార్‌ మాట్లాడుతూ లవ్‌, యాక్షన్‌, ఫ్యామిలీ అంశాలు మేళవించిన కథాంశమిది. కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయి.

ఇంటెన్స్‌ లవ్‌స్టోరీగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తాం అన్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.  ఈ చిత్రానికి కెమెరా: సజీష్‌ రాజేంద్రన్‌, సంగీతం: కార్తీక్‌ బి కొడకండ్ల, రచయిత, దర్శకత్వం: పవన్‌ కుమార్‌ కొత్తూరి.

Social Share Spread Message

Latest News