Skip to main content

Namaste NRI

సత్యభామతో నా కెరీర్‌ మరో దిశలోకి వెళ్తుంది: కాజల్‌

కాజల్‌ అగర్వాల్‌  ప్రధాన పాత్ర పోషించిన చిత్రం సత్యభామ. సుమన్‌ చిక్కాల దర్శకుడు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మాతలు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో కాజల్‌ మాట్లాడింది. సత్యభామ నా కెరీర్‌లో కొత్త ప్రయత్నం. ఇలాంటి పాత్ర చేయడం ఇదే ప్రథమం. ఈ కథలో కొత్త ఎమోషన్స్‌ ఉన్నాయి. ఫస్ట్‌టైమ్‌ నా కెరీర్‌లో భారీ యాక్షన్‌ సీన్స్‌ చేశాను. చాలా కష్టపడి స్టంట్స్‌ చేశాను. ఇందులోని నా పాత్ర పర్సనల్‌ లైఫ్‌, ప్రొఫెనల్‌ లైఫ్‌ రెండూ బ్యాలెన్స్‌ చేస్తుంటుంది. రియల్‌లైఫ్‌లో నేను చేస్తున్నది కూడా అదే. ఈ సినిమా మేకింగ్‌ టైమ్‌లో ఓ పెద్ద పోలీస్‌ ఆఫీసర్‌ని కలిశాను. ఆయన క్రిమినల్‌ యాక్టివిటీస్‌ గురించి వివరంగా చెప్పారు. ఆయన చెప్పిన అంశాలనే ఈ కథలో భాగం చేశాం. పూర్తిస్థాయి యాక్షన్‌ సినిమా చేయాలనే నా కోరిక సత్యభామ తో తీరింది అని అన్నారు.  

యాక్షన్‌, ఎమోషన్స్‌ కలగలసిన కథాంశంతో తెరకెక్కిన సినిమా ఇదని, ఓ కేసును పర్సనల్‌గా తీసుకొని ఇన్విస్టిగేషన్‌ చేస్తున్న ఓ పోలీస్‌ ఆఫీసర్‌, ఆ కేసు విషయంలో ఎమోషనల్‌ అవుతుంది. చివరకు ఆ కేసును జస్టిస్‌ చేయగలిగిందా లేదా? అనేది ఈ సినిమా కథ అని, కాజల్‌లోని కొత్త కోణాన్ని ఇందులో చూస్తారని దర్శకుడు చెప్పారు. ఇంకా నిర్మాతలు కూడా మాట్లాడారు. జూన్‌ 7న సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News