స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్‌పై ఓ సంచలన కథనం ప్రచురితమైంది. మస్క్ తన కంపెనీలో పని చేసిన ఇద్దరు ఉద్యోగినులతో శృంగారంలో పాల్గొన్నాడని, తనతో పిల్లల్ని కనాలని వారిపై ఒత్తిడి చేశాడని ఈ కథనం పేర్కొన్నది. స్పేస్ఎక్స్లో పని చేసి 2013లో బయటకు వచ్చేసిన ఓ మహిళ మస్క్‌పై ఈ ఆరోపణలు చేశారు. ప్రపంచం జనాభా సంక్షోభంలో ఉందని, అధిక ఐక్యూ కలిగిన పిల్లలను కనాలని మస్క్ చెప్పేవాడని మహిళ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి వీరి మధ్య జరిగిన సంభాషణను సైతం ఈ కథనంలో ప్రచురించారు. అంతేకాదు, స్పేస్ఎక్స్, టెస్లా కంపెనీల్లో మస్క్ మహిళా వ్యతిరేక వాతావరణం సృష్టించాడని సైతం ఈ కథనం పేర్కొన్నది. మస్క్‌పై ఈ తరహా వివాదాస్పద ఆరోపణలు రావడం కొత్తేమీ కాకపోవడం గమనార్హం.