Skip to main content

Namaste NRI

ఎలాన్‌ మస్క్‌ పై మాజీ ఉద్యోగినుల దావా

లైంగిక వేధింపుల ఆరోపణలు బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ను, ఆయన కంపెనీ స్పేస్‌ ఎక్స్‌ను వెంటాడుతున్నా యి. తాజాగా 8 మంది మాజీ మహిళా ఉద్యోగులు స్పేస్‌ ఎక్స్‌, మస్క్‌కు వ్యతిరేకంగా కోర్టులో దావా వేశారు.  వ్యక్తిగతంగా తమపై కక్షగట్టి ఉద్యోగంలో నుంచి తొలగించే ఉత్తర్వులు మస్క్‌ ఇచ్చాడని దావాలో వారు ఆరోపించారు. పని ప్రదేశంలో లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయగానే, తమను ఉద్యోగంలో నుంచి తొలగించారని పేర్కొన్నారు. మహిళల్ని లైంగిక వస్తువులుగా మస్క్‌ పరిగణిస్తున్నాడని, పని ప్రదేశంలో నెలకొన్న వాతావరణాన్ని ఎవరైనా సవాల్‌ చేస్తే ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చేదని వారు ఆరోపించారు.

Social Share Spread Message

Latest News