Skip to main content

Namaste NRI

నాగ చైతన్య తండేల్ కీలక షెడ్యూల్ పూర్తి

నాగచైతన్య మత్స్యకారుడి పాత్రలో నటిస్తూ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం తండేల్‌. చందు మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. సాయిపల్లవి కథానాయిక. ఇటీవల ఈ చిత్రం శ్రీకాకుళం షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. విశాఖపట్నం, శ్రీకాకుళంలోని సుందరమైన లొకేషన్లలో కీలకమైన ఘట్టాలను తెరకెక్కించారు.

సన్నివేశాల్లో వాస్తవికత ప్రతిబింబించేలా స్థానిక మత్స్యకారులను షూటింగ్‌లో భాగం చేశారు. అనూహ్య పరిస్థితుల్లో పాకిస్తాన్‌ సైన్యం చేతిలో బందీ కాబడ్డ భారత జాలరులు అక్కడి నుంచి ఎలా బయపడ్డారు? దేశభక్తిని గుండెల్లో నింపుకున్న ఆ మత్స్యకారుల బృందం చేసిన సాహసాలేమిటన్నదే ఈ చిత్ర కథాంశం. ఇప్పటికే రిలీజ్‌ చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించిందని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత బన్నీ వాసు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: షామ్‌దత్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, సమర్పణ: అల్లు అరవింద్‌, రచన-దర్శకత్వం: చందూ మొండేటి.

Social Share Spread Message

Latest News