Skip to main content

Namaste NRI

ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. కాంగ్రెస్‌పై పోరాటం ఆగదు

కేటీఆర్  కుటుంబం నిర్వహించిన ప్రైవేట్ విందు కార్యక్రమాన్ని కాంగ్రెస్‌  పార్టీ రేవ్ పార్టీగా వక్రీకరించడం అనైతికమని, ఇది పూర్తిగా కేటీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని చేపట్టిన పిరికి చర్య అని బీఆర్‌ఎస్‌ సౌత్ ఆఫ్రికా ఎన్నారై అధ్యక్షుడు నాగరాజు గుర్రాల అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పార్టీని ప్రత్యక్షంగా ఎదుర్కొనే ధైర్యం లేక కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇలా చిల్లర రాజకీయాల ధోరణిని అవలంబిం చడం సిగ్గు చేటన్నారు.  రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని, ప్రజలు ఈ చిల్లర రాజకీయాలను గమనిస్తున్నారని హెచ్చరించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్‌పై పోరాటం ఆగదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఉద్యమిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కావాలనే డైవర్షన్‌ టాక్టిక్స్‌ వాడుతున్నారని ఆరోపించారు.

Social Share Spread Message

Latest News