
జగపతిబాబు, లయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ వదలా. ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వం. ఈ చిత్రాన్ని కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.ఇది మిస్టీరియస్ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఆసక్తిని రేకెత్తిస్తున్నది. మూడు పాత్రల మధ్య సంఘర్షణ ఏమిటన్నది ఆసక్తికరంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. హృతికా శ్రీనివాస్, అవసరాల శ్రీనివాస్, రవివర్మ, జెన్నీ తదితరులు నటిస్తున్నారు. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది.ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ కొడకండ్ల, దర్శకత్వం: ఆకెళ్ల వి కృష్ణ.





























