Namaste NRI

శ్రీలంక పార్లమెంటు ఎన్నికలు.. భారీ విజయం దిశగా దిసనాయకే పార్టీ

శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో  అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే పార్టీ భారీ విజయం దిశగా దూసుకె ళ్తున్నది. ప్రాథమిక ఫలితాల ప్రకారం గురువారం జరిగిన ఓటింగ్‌లో ఆయన నేతృత్వంలోని నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌  సంకీర్ణ పార్టీ 63 శాతం ఓట్లతో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది. అయితే 225 మంది సభ్యుల సభలో ఎన్‌పీపీ దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ లీడింగ్‌లో ఉన్నట్లు లేటెస్టు సమాచారం. కాగా, ప్రస్తుత పార్లమెంటులో ఆ పార్టీ బలం మూగ్గురు సభ్యులే మాత్రమే గమనార్హం. ఇక సెప్టెంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అనుర దిసనాయకే అధికారం చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. అవినీతిని ఎదుర్కోవడంతో పాటు దేశం కోల్పోయిన ఆస్తులను తిరిగి సంపాదిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events