Namaste NRI

అమెరికా కాన్సుల్ జనరల్ అరకు పర్యటన

హైదరాబాద్‌ రీజియన్‌ అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జోయెల్‌ రీఫ్‌మన్‌ అరకులో పర్యటించారు. తన జీవన భాగస్వామి (గే) పెర్రి మిల్టన్‌తో కలసి విశాఖ వచ్చిన ఆయన అద్దాల బోగీలున్న రైల్లో అరకు వెళ్లారు.  విశాఖలోని తీరప్రాంతం అద్భుతంగా ఉందని అన్నారు. ఈ రైల్లో ప్రయాణిస్తూ కొండలు, లోయల అందాలను ఆస్వాదించినట్లు తెలిపారు. అరకు గిరిజన మ్యూజియం చూసిన తరువాత గిరిజన చరిత్ర, వారి  జీవన విధానంపై మరింత అవగాహన కలిగిందన్నారు. గిరిజనుల గురించి తెలుసుకోవడానికి అరకు లోయ అద్భుత ప్రాంతమని కొనియాడారు. 

Social Share Spread Message

Latest News