Skip to main content

Namaste NRI

ప్రధాని మోదీకి మరో అత్యున్నత పురస్కారం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నైజీరియా తన రెండో అత్యున్నత జాతీయ పురస్కారం ది గ్రాండ్‌ కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది నైగర్‌ తో సత్కరించింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఈ పురస్కారాన్ని అత్యం త వినమ్రతతో స్వీకరిస్తున్నానని చెప్పారు. దీనిని భారత ప్రజలకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఈ విశిష్ట పురస్కారాన్ని స్వీకరించిన రెండో విదేశీ నేత ఆయన. 1969లో క్వీన్‌ ఎలిజబెత్‌ను ఈ అవార్డుతో నైజీరి యా గౌరవించింది. మోదీకి లభించిన ఇటువంటి విదేశీ పురస్కారాల్లో ఇది 17వది.

Social Share Spread Message

Latest News