Skip to main content

Namaste NRI

ఇది అనుభవించిన వారికే తెలుస్తుంది… ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లేవ్‌  

ప్రేమలో రెండు సార్లు విఫలమైన కారణంగా మనశ్శాంతిని కోల్పోయినట్లుంది చెన్నై చందమామ శ్రుతిహాసన్‌. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, రిలేషన్‌, పెళ్లి అంశాలపై శ్రుతిహాసన్‌  ప్రస్థావించిన తీరు ప్రస్తుతం చర్చనీయాం శమైంది. ప్రేమలో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. అభిప్రాయబేధాల వల్ల అంతరాలు పెరుగుతున్నప్పుడు ఓ బాధ. విడిపోయిన తర్వాత ఓ బాధ. ఇది అనుభవించిన వారికే తెలుస్తుంది. పెళ్లి అనే కట్టుబాటు బంధాలను శాశ్వతం చేస్తుందంటే కూడా నేను నమ్మను. ఎవర్నీ బలవంతంగా కలిపి ఉంచలేం. మా అమ్మానాన్న ప్రేమించే పెళ్లి చేసుకు న్నారు. చాలా అందమైన జంట. ఈ ప్రపంచంలో ఉత్తమ జంట మా అమ్మానాన్నే అనుకునేదాన్ని. ఇద్దరూ చాలా కాలం కలిసున్నారు. ఆ టైమ్‌లో మా ఇల్లు చాలా బావుండేది. ఉన్నట్టుండి విడిపోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. అయినా కలిసి ఉండటానికి ప్రయత్నించారు. కానీ కుదర్లేదు. పరిస్థితులకు ఎదురొడ్డి గెలవలేం. ఎవరో ఒకరు రాజీ పడితే తప్ప బంధాలు నిలవవ్‌. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లేవ్‌. అందుకే పెళ్లిపై నాకు సదాభిప్రాయం లేదు అని తేల్చేసింది శ్రుతిహాసన్‌.

Social Share Spread Message

Latest News