Namaste NRI

ఇండస్ట్రీలో నాకో స్థానం : హీరో ధర్మ

ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం డ్రింకర్‌ సాయి. కిరణ్‌ తిరుమల శెట్టి దర్శకత్వం. బసవరాజు శ్రీనివాస్‌, ఇస్మాయిల్‌ షేక్‌, లహరిధర్‌ బసవరాజు నిర్మాతలు. డిసెంబర్‌ 27న విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నదని మేకర్స్‌ చెబుతున్నారు. హైదరాబాద్‌లో మీడియాకు ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించా రు. తాను అనుకున్న పాయింట్‌ ప్రేక్షకులకు బాగా రీచ్‌ అయ్యిందని, ఫలితం పట్ల అందరం ఆనందంగా ఉన్నామని, హీరోహీరోయిన్లతోపాటు ఇరవైమంది కొత్తవాళ్లను ఈ సినిమా ద్వారా పరిచయం చేశామని దర్శకుడు తెలిపారు. ఇప్పటి వరకూ 5.75 కోట్ల గ్రాస్‌ను ఈ సినిమా కలెక్ట్‌ చేసిందని నిర్మాతలు తెలిపారు.ఈ సందర్భంగా హీరో ధర్మ మాట్లాడుతూ ఈ సినిమాను ఆదరించడం ద్వారా చిత్ర పరిశ్రమలో యువ హీరోగా నాకో స్థానం కల్పించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. కొత్త వాళ్లకు ఇండస్ట్రీలో ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని మరోసారి రుజువైంది అని అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events