
మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్ నటిస్తున్న తాజా చిత్రం లూసిఫర్-2: ఎంపురాన్. 2019లో వచ్చిన లూసిఫర్ చిత్రానికి సీక్వెల్ ఇది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్నది. టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో డాన్ ఖురేషి అబ్రామ్‌గా మోహన్‌లాల్‌ను పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేశారు. ఈ యుద్ధం మంచికి చెడుకి కాదు ..చెడుకి చెడుకీ మధ్య వంటి డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. లూసిఫర్ సినిమా కంటే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, రోమాంచితమైన యాక్షన్ ఘట్టాలతో ఈ సినిమాను తెరకెక్కించామని, మోహన్‌లాల్ పాత్ర అత్యంత శక్తివంతంగా సాగుతుందని మేకర్స్ తెలిపారు. మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది. ఈ చిత్రంలో టోవినో థామస్, మంజు వారియర్, నందు, సానియా అయ్యప్పన్ తదితరులు నటించారు.















