Skip to main content

Namaste NRI

కువైత్ కీలక సూచన.. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం

భారత నర్సుల నియామకాలపై కువైత్‌ రాయబారి సిబి జార్జ్‌ తాజాగా కీలక సూచన చేశారు. భారత ప్రభుత్వం పేర్కొన్న విధంగా మాత్రమే రిక్రూటర్లకు ఫీజు చెల్లించాలని తెలిపారు. ఎట్టిపరిస్థితిలో అదనంగా ఎవరికీ రూపాయి కూడా చెల్లించ వద్దని పేర్కొన్నారు. నోటిఫికేషన్‌ ప్రకారం రిక్రూటర్లు కేవలం రూ.30 వేల వరకూ మాత్రమే ఫీజు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. దీనికి అదనంగా ఎవరైనా అడిగితే వెంటనే తన దృష్టి తీసుకురావాలని తెలిపారు. వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ఒక్క రూపాయి అదనంగా తీసుకున్న అదే స్కామ్‌ కిందికి వస్తుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ నియామకాల ప్రక్రియను ఆరోగ్యశాఖ సహాయంతో నేరుగా నిర్వహించే విషయమై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. త్వరలోనే దీనిపై  తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందన్నారు.

Social Share Spread Message

Latest News