Namaste NRI

కెనడాలో కొత్త ఇమ్మిగ్రేషన్ రూల్స్… వేల మంది భారతీయులు వెనక్కి రాక తప్పదా?

 కెనడా ప్రభుత్వం వలసదారుల నిబంధనల్లో భారీ మార్పులు తీసుకొచ్చింది. ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ రెఫ్యూజీ ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్స్‌ పేరుతో రూపొందించిన ఈ నిబంధనలు జనవరి 31 నుంచి అమల్లోకి వచ్చాయి. వీటి ద్వారా బోర్డర్‌ అధికారులకు మరిన్ని అధికారాలు లభించాయి. ఎలక్ట్రానిక్‌ ట్రావెల్‌ ఆథరైజేషన్స్‌ (ఈటీఏ), టెంపరరీ రెసిడెంట్‌ వీసా (టీఆర్‌వీ) వంటి డాక్యుమెంట్లను రద్దు చేసే అధికారం అధికారులకు ఉంటుంది. ఇతర దేశాల నుంచి కెనడాకు విద్య, ఉద్యోగాలు, తాత్కాలిక బస కోసం వెళ్లేవారిపై, మరీ ముఖ్యంగా భారతీయులపై దీని ప్రభావం పడుతుంది. వివిధ కారణాలను చూపించి, ఈటీఏ, టీఆర్‌వీ, వర్క్‌ పర్మిట్‌, స్టడీ పర్మిట్లను కెనడా ఇమ్మిగ్రేషన్‌, బోర్డర్‌ అధికారులు రద్దు చేయవచ్చు. తప్పుడు సమాచారం ఇవ్వడం, క్రిమినల్‌ రికార్డు ఉండటం వంటి కారణాలను చూపి రద్దు చేయవచ్చు. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత కెనడా నుంచి తిరిగి వెళ్లిపోతానని వీసాదారు సంబంధిత అధికారికి నమ్మకం కలిగే విధంగా చెప్పలేకపోయినా ఆ పర్మిట్‌ను రద్దు చేయవచ్చు. పర్మిట్లు రద్దయితే కెనడా నౌకాశ్రయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉండదు.

Social Share Spread Message

Latest News