ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వచ్చిన జ్ఞాపికలు, బహుమతుల ఈ`వేలంలో పాల్గొని నమామి గంగే ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కోరారు. మహాత్మా గాంధీ 152వ జయంతి సందర్భంగా ఢల్లీి ఎన్జీఎంఏలో ప్రదర్శనకు ఉంచిన ఈ`వేలం వస్తువులను ఆయన పరిశీలించారు. సెప్టెంబర్ 17న ప్రారంభమైన ఈ `వేలం అక్టోబర్ 7 వరకు కొనసాగుతుంది. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి తనకు వచ్చిన వస్తువులను గతంలో రెండు సార్లు వేలం వేసి ఆ నిధులను మంచి కార్యక్రమాలకు వినియోగించారని తెలిపారు. ఈ దఫా వచ్చే నిధులను గంగా నది శుద్ధికి సంబంధించిన నమామి గంగే ప్రాజెక్టును వినియోగించనున్నట్లు తెలిపారు. ప్రస్తుత వేలంలో 1,348 వస్తువులు, జ్ఞాపికలు వేలంలో పెట్టగా ఇప్పటికే దాదాపు 1,081 బిడ్లు దాఖలయ్యాయని తెలిపారు. మహత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛ భారత్ చిహ్నాన్ని కేంద్ర మంత్రి చిత్రీకరించారు.














