ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్లుటీవో)కు అమెరికా నుంచి వెళ్లే నిధులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కత్తర వేశారు. ట్రంప్ కార్యవర్గం అనుసరిస్తున్న వ్యాపార రక్షణాత్మక వైఖరిని మరింత బలోపేతం చేసుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నారు. ట్రంప్ అధికారం లోకి వచ్చింది మొదలు ప్రపంచ స్థాయి వేదికల నుంచి అమెరికాను పక్కకు తప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇప్పటికే ప్రపంచ ఆరోగ్యసంస్థ నుంచి అమెరికా వైదొలిగినట్టు ప్రకటించారు. తాజాగా డబ్లుటీవోకు నిధులను నిలిపివేశారు. దీంతోపాటు అనేక దేశాలకు అందించే విదేశీ సాయాన్ని కూడా నిలిపివేశారు. వాస్తవానికి 2019 లోనే ట్రంప్ డబ్లుటీవోను బలహీనపర్చారు. నాడు ఆ సంస్థలో న్యాయమూర్తుల నియామకాలను ఆయన నిలిపివేశారు. దీంతో ఆ సంస్థ వివాద పరిష్కార వేదిక విభాగం బలహీనపడిపోయింది.

2024లో డబ్లుటివో నిర్వహణకు 232 మిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. ప్రపంచ వాణిజ్యం ప్రతిదేశం వాటా ఆధారంగా ఈ సంస్థకు నిధులు సమకూరుస్తారు. ఇక అమెరికా నుంచి దీనికి దాదాపు 11 శాతం అందుతాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన అదనపు సుంకాలు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రానున్నాయి.















