అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. టెక్సాస్‌లోని ఓ పాఠశాలలోకి చొరబడిన దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. టెక్సాస్ ఆర్లింగ్టన్‌లోని ఓ హైస్కూల్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాట్లాడుతూ పాఠశాలలో జరిగిన కాల్పులకు అధికారులు స్పందించారన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలయ్యాయో ఇంకా నిర్ధారించలేదని తెలిపారు. అధికారులు విచారణ జరుపుతున్నారని పోలీస్ శాఖ తెలిపింది. కాల్పుల నేపథ్యంలో పాఠశాలల వెలుపల అంబులెన్స్‌లు, ఫైరింజన్లను మోహరించారు.














