Skip to main content

Namaste NRI

యముడు చిత్రీకరణ పూర్తి!

జగదీష్‌ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం యముడు. ధర్మో రక్షతి రక్షితః ఉపశీర్షిక. శ్రావణి శెట్టి కథానాయిక. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల తేదీని ప్రకటించబోతున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. మైథలాజికల్‌ టచ్‌ ఉన్న సినిమా ఇదని, యముడి పాత్ర చుట్టూ వచ్చే సన్నివేశాలు కీలకంగా ఉంటాయని, సరికొత్త కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: విష్ణురెడ్డి వంగా, సంగీతం: భవాని రాకేష్‌, కథ, దర్శకత్వం, నిర్మాత: జగదీష్‌ ఆమంచి.

Social Share Spread Message

Latest News