Namaste NRI

చైనాలో కొత్త చట్టం.. పిల్లలు తప్పు చేస్తే

పిల్లలు తప్పు చేస్తే వారి తల్లిదండ్రులను శిక్షించడానికి చైనా సిద్ధమైంది. ఇందుకోసం చట్టాన్ని తీసుకురానున్నది. పిల్లల్లో చెడు ప్రవర్తనా ఉన్నా వాళ్లకు వెంటనే ఫ్యామిలీ ఎడ్యుకేషన్‌ గైడెన్స్‌ ప్రోగ్రామ్స్‌ను అందించాలని నిర్ణయించిన చైనా ప్రభుత్వం ఇందుకోసం ఫ్యామిలీ ఎడ్యుకేషన్‌ డ్రాఫ్ట్‌ లాను తీసుకొచ్చింది. ఇప్పటికే ముసాయిదా బిల్లును కూడా సిద్ధం చేసింది. ఇది చట్టం అయితే 16 ఏండ్ల లోపు పిల్లలు నేరాలు చేస్తే వారి తల్లిదండ్రులకు శిక్షలు విధిస్తారు. పిల్లలు విశ్రాంతి తీసుకోవడానికి, ఆడుకోవడానికి, వ్యాయామానికి కూడా తల్లిదండ్రులు తగిన సమయం ఇవ్వాలని ఈ చట్టం సూచిస్తుంది. చిన్నప్పటి నుంచి పిల్లల్లో పాజిటివ్‌ ఆటిట్యూడ్‌ ను పెంచేలా చేస్తే భవిష్యత్తులో పెద్దయ్యాక వాళ్ల వల్ల ఎటువంటి నష్టాలు వాటిల్లవు అని చైనా బిల్లులో చైనా ప్రభుత్వం పేర్కొంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events