Namaste NRI

జెట్టీ మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన బాలయ్య

నందిత శ్వేత, మాన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం జెట్టి. సుబ్రమణ్యం పిచ్చుక దర్శకుడు. కే వేణు మాధవ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా త్వరలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే హీరో బాలకృష్ణ ట్రైలర్‌ విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.  జెట్టి ట్రైలర్‌లో నా ఆశ కంటే మా నాన్న ఆశయం ముఖ్యం అంటూ హీరోయిన్‌ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైంది. ఊరికి జెట్టిని తీసుకురావాలనే తండ్రి ఆశయాన్ని సాధించేందుకు కూతురుగా రాజీలేని పోరాటం చేస్తుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఓ మత్స్యకార గ్రామంలో జరిగిన ఘటనలను ఆధారంగా తీసుకొని ఈ చిత్రం నిర్మించాం. మత్స్యకారుల జీవన విధానాలను, వారి కట్టుబాట్లను దర్శకుడు ఎంతో చక్కగా చిత్రీకరించారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తామన్నారు. సంగీతం: కార్తిక్‌ కొండకండ్ల, ఛాయాగ్రహణం: వీరమణి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events