Namaste NRI

పర్యాటక అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తా : కిషన్ రెడ్డి

తెలుగు రాష్ట్రాల్లోనే రామప్పగుడికి ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కడం మనకు గర్వకారణమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి అన్నారు. ములుగు జిల్లా వెంకటాపుర్‌ మండలంలోని రామప్ప ఆలయాన్ని  సందర్శించారు. ప్రపంచ వారసత్వ శిలాఫలకాన్ని ఆవిష్కరించి, ప్రజా మౌలిక సదుపాయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రి పదవి స్వీకరించిన తర్వాత మొదటగా రామప్పకు యునెస్కో గుర్తింపు అంశమే పరిశీలించా. ప్రధానమంత్రి మోదీ దృష్టికి తీసుకెళ్లగా వ్యతిరేకించిన దేశాలతో మాట్లాడి యూనెస్కో గుర్తింపు దక్కేలా కృషి చేశారు.                

రామప్పతో పాటు రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తామన్నారు. ఇప్పటికే ట్రైబుల్‌ సర్క్యూట్‌ కింద గట్టమ్మ, లక్నవరం, మేడారం మల్లూరు, బొగత తదితర ప్రాంతాల్లో హోటళ్ల కాటేజీల నిర్మాణం కోసం కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు మంజూరు చేశామన్నారు. జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్‌, సోమశిల, శ్రీశైలం ప్రాంతాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. హనుమకొండలో వెయ్యి స్తంభాల గుడి పనులు యుద్ద ప్రాతిపదికన చేపట్టిన పూర్తి చేస్తాం. రామప్ప, వెయ్యి స్తంభాల గుడి,  ఖిలా వరంగల్‌ కోట, గోల్కోండ  ఆలంపూర్‌, చార్మినార్‌ను మరింత అభివృద్ధి పరుస్తాం. వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రన్‌వేలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తే ఉడాన్‌ కథకం కింద పర్యాటకులకు రాయితీలు కల్పిస్తామన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events