Skip to main content

Namaste NRI

భారత్, కువైత్ మధ్య కీలక ఒప్పందం

కువైత్‌లో పని మనుషులుగా అధిక సంఖ్యలో భారత్‌ నుంచే వెళ్తుంటారు. ఉపాధి కోసం ఇండియా నుంచి వెళ్లే మహిళలు ఎక్కువగా ఇంట్లో పని మనుషులుగానే చేరుతుంటారు. తాజాగా భారత్‌, కువైత్‌ మధ్య కీలక ఒప్పందం కుదిరిన్నట్లు తెలుస్తోంది. దీనికి ఆ దేశ కేబినెట్‌ కూడా ఆమోదం తెలిపిందని సమాచారం. ఈ ఒప్పందం ప్రకారం భారతీయ మహిళలను పని మనుషులుగా నియమించుకునేందుకు కొన్ని నిబంధనలు తెరపైకి వచ్చాయని తెలిసింది. వీటిలో ప్రధానంగా మహిళల వయసు 30 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్కులను మాత్రమే నియమించుకోవాలి. 30 కంటే తక్కువ వయసు ఉన్నవారిని ఎట్టిపరిస్థితిలో రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీలు నియామకాలు చేపట్టకూడడు. అలాగే జీతం కూడా నెలకు వంద కువైటీ దీనార్లకు (సుమారు రూ.25 వేలు) తక్కువ ఇవ్వరాదు. అది కూడా నగదు రూపంలో చేతికి ఇవ్వకూడదు. యజమానినే పనిమనిషి పేరు మీద తప్పకుండా ఓ బ్యాంకు ఖాతా తెరిపించి అందులో వేయాలి. పనికి కుదుర్చుకున్నవారి కాంట్రాక్ట్‌ ముగిసేవరకు ఇదే పద్దతి కొనసాగాలి. అంతేగాక ఎంప్లాయిమెంట్‌ కాంట్రాక్ట్‌ అఫ్రూవ్‌ చేసేందుకు రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీలు తప్పనిసరిగా భారత ఎంబసీ అనుమతి తీసుకోవాలి.

Social Share Spread Message

Latest News