Skip to main content

Namaste NRI

ఆస్కార్ బరిలో కూళంగల్

అగ్ర కథానాయిక నయనతార  నిర్మాతగా వ్యవహరించిన ఓ తమిళ చిత్రం ఆస్కార్‌ ఎంట్రీని దక్కించుకున్నది. కాబోయే భర్త, దర్శకుడు విఘ్నేష్‌శివన్‌తో కలిసి ఆమె ఈ చిత్రాన్ని నిర్మించారు. భారత దేశం తరపున ఆస్కార్‌ 2022 పురస్కారాలకు ఉత్తమ అంతర్జాతీయ పీచర్‌ కేటగిరీలో ఇండియా నుంచి అధికారిక ఎంట్రీగా తమిళ చిత్రం కూళంగల్‌ ఎంపికైంది. ఆస్కార్‌ సెలక్షన్‌ కమిటీ చైర్‌పర్సన్‌ షాజీ ఎన్‌. కరుణ్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. దర్శకుడు పీఎస్‌ వినోద్‌రాజ్‌కు ఇదే తొలి చిత్రం. నయనతార, విఘ్నేష్‌ శివన్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ కేటగిరిలో హిందీ చిత్రాలు సర్దార్‌ ఉదమ్‌, షేర్ని, మలయాళ చిత్రం నయట్టు సహా వివిధ భాషల నుంచి మొత్తం పద్నాలుగు చిత్రాలు అధికారిక ఎంట్రీ కోసం పోటీపడగా జ్యూరీ కూళంగల్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. ఆస్కార్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచాను. మంచి సినిమా నిర్మించినందుకు  గర్వంగా ఉంది అని  విఘ్నేష్‌ అన్నారు. ఎన్నో సంవత్సరాల కల. ఆస్కార్‌ అందుకోవడానికి ఇక రెండు అడుగుల దూరంలోనే ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది అన్నారు.

Social Share Spread Message

Latest News