Namaste NRI

తెలంగాణ తలెత్తుకునేలా చేశాం… టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రం ఏడేళ్లలో అద్భుత ప్రగతిని సొంతం చేసుకుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో కేసీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణను తలెత్తుకునేలా చేసిన పార్టీ టీఆర్‌ఎస్‌. సమాజంలో చిరునవ్వే మా లక్ష్యం అని తెలిపారు. తెలంగాణ ఏర్పడితే ఎన్నో అనర్థాలు జరిగిపోతాయన్న అపోహలను అభివృద్ధితో పటాపంచలు చేశామన్నారు. దేశ, విదేశాల్లో మన ప్రతిష్టను ఇనుమడిరపచేస్తున్నామన్నారు.  అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే విన్నగా ఉందన్నారు. తలసరి విద్యుత్‌ వినియోగంలో నవంబర్‌ 1 స్థానంలో ఉండగా తలసరి ఆదాయంలో మొదటి, రెండు రాష్ట్రాలతో సమానంగా ఉన్నామని తెలిపారు.

                లాక్‌డౌన్‌, కరోనా వంటి పరిస్థితుల్లోనూ 11.5 శాతం వృద్ధిరేటుతో అగ్రామిగా నిలిచామన్నారు. నేడు పంజాబ్‌ను తలదన్ని మూడు కోట్ల టన్నుల ధాన్యం పండిరచాం. ఇతర రాష్ట్రాల సీఎంలు ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువలా వస్తున్నాయి. ఐటీ ఎగుమతులు రూ.57 వేల కోట్ల నుంచి రూ.1.57 లక్షల కోట్లకు పెరిగాయి. దళితబంధు చేపట్టిన తర్వాత, ఆంధ్ర ప్రాంతం నుంచి వందల, వేల విజ్ఞాపనలు వస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ పార్టీలో ఆంధ్రలో ప్రారంభించడం గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం అంటున్నారు. మీ పథకాలు మాకు కూడా కావాలని వారు కోరుతున్నారు. మహారాష్ట్ర నాందేడ్‌ జిల్లాలోని అయిదు నియోజవకవర్గాల నాయకులు, కర్ణాటకలోని రాయచూర్‌ ఎమ్మెల్యే వారి రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలు చేయాలని, లేదంటే తమను తెలంగాణలో కలపాలని డిమాండ్‌ చేస్తున్నారని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events