అమెరికాలోని షికాగోలో వైఎస్‌ఆర్‌సీపీ జనాగ్రహదీక్ష చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఉద్దేశించి టీడీపీ నేతలు వాడిన అసభ్య పదజాలాన్ని నిరసిస్తూ వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు కొండపల్లి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ మీ కార్యకర్తలు, మీ కుటుంబ సభ్యులు బోషిడికే అనే పదంతో పిలుస్తారా అని టీడీపీ ఎన్‌ఆర్‌ఐ వింగ్‌ని ప్రశ్నించారు. తమ పార్టీ నేతలు తప్పు చేస్తే నాయకుడిగా సరిదిద్దాల్సి పోయి చంద్రబాబు నాయడు వంటి వ్యక్తి ఆ బూతులను సమర్థించడం దారుణమన్నారు. వైఎస్‌ఆర్ కుటుంబంపై జరిగినటువంటి నీచమైన దాడులు రాజకీయాల్లో ఏ ఫ్యామిలీపైనా జరగలేదని, కేవలం ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతోనే వైఎస్ జగన్ అన్నింటిని భరిస్తూ ముందుకు సాగుతున్నారని యత్తపు శరత్‌రెడ్డి అన్నారు. రాజకీయాల్లో పట్టాభి అనుసరించిన నీచ పద్దతిని పార్టీలకు, మతాలకు, దేశాలకు అతీతంగా అంతా ఖండిచాలన్నారు.
ఈ జనాగ్రహ దీక్షలో భీమ్‌రెడ్డి అల్వాల, విజయ్ రెడ్డి సంకెపల్లి, రమేశ్ తుమ్మూరి, పవన్, సోహిత్, రామిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, శ్రీధర్ రెడ్డి అలవాల, వెంకటేశ్వరరెడ్డి, వెంకట్ ముమ్మడి తదితరులు పాల్గొన్నారు.














