Skip to main content

Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌కు మరోసారి ఎదురుదెబ్బ ..హార్వర్డ్ కు ఇవ్వాల్సిందే  

 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మరోసారి ఫెడరల్‌ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిష్ఠాత్మక హార్వర్డ్​ యూనివర్సిటీకి నిధుల నిలిపివేత  నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని యూఎస్‌ అత్యున్నత కోర్టు ఆదేశించింది. తాము చెప్పినట్లు నడుచుకోవడం లేదని, అడిగిన సమాచారం ఇవ్వడం లేదని చెబుతూ వర్సిటీకి ట్రంప్‌ సర్కార్‌ 2.6 బిలియన్‌ డాలర్ల నిధుల కోత విధించిన విషయం తెలిసిందే. దీనిపై కోర్టు మెట్లెక్కిన యూనివర్సిటీ‌, వైట్‌హౌస్‌తో న్యాయ పోరాటంలో విజయం సాధించింది. హార్వర్డ్ తన పాలన విధానాల్లో మార్పు కోసం వైట్​ హౌస్ చేసిన డిమాండ్లను తిరస్కరించినందుకు ట్రంప్ సర్కార్​ తీసుకున్న ప్రతీకార చర్య అని కోర్టు తీర్పునిచ్చింది. వర్సిటీలో యూదులపై వ్యతిరేకత విషయానికి ఈ నిధుల కోతకు సంబంధం లేదని పేర్కొంది. ఫెడరల్ నిధులను నిలిపివేయడాన్ని సమర్థించేందుకు యూదులపై వ్యతిరేకతను సాకుగా చూపవద్దని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కోతల కారణంగా నిలిచిన వందలాది రీసెర్చ్ ప్రాజెక్టులు మళ్లీ పట్టాలెక్కనున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events