
కెంట్‌లోని డార్ట్‌ఫోర్డ్ నగరంలో ఫీనిక్స్ క్వార్టర్స్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆగస్టు 27 నుంచి ఐదు రోజులపాటు నిర్వహించిన ఈ వేడుకలకు భక్తులంతా కుటుంబ సమేతంగా విచ్చేసి, గణపతి ఆశీస్సులు పొందారు. భారతీయ, తెలుగు వంటకాలతో విందు, ప్రసాద ఏర్పాట్లు చేశారు. చిన్నారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గణేష్ లడ్డూ వేలం నిర్వహించగా రమణ`ప్రతిభ దంపతులు దానిని సొంతం చేసుకున్నారు. ఆగస్టు 31న గణపతిని ఊరేగించిన, నిమజ్జనం చేశారు. ఈ వేడుకలు 700 మంది హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించినట్లు డార్ట్ ఫోర్డ్ ఫీనిక్స్ క్వార్టర్స్ కమ్యూనిటీ వాలంటీర్ కృష్ణ పవన్ చల్లా తెలిపారు.
















