Skip to main content

Namaste NRI

స్కాట్లాండ్ పై పాకిస్థాన్ ఘన విజయం

టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌ తన హవాను కొనసాగిస్తుంది.  షార్జా వేదికగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత 20 ఓవర్లతో 189 పరుగులు చేసింది. బాబర్‌  అజామ్‌ (66), షోయబ్‌ మాలిక్‌ (54) రాణించారు. అనంతరం 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్‌ 6 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. స్కాట్లాండ్‌ జట్టులో బెరింగ్‌టన్‌ (54) టాప్‌ స్కోరర్‌. మిగతా వారు విఫలమవడంతో ఆ జట్టు 117 పరుగులకే పరిమితమైంది. పాక్‌ బౌలర్లలో షాదాబ్‌ ఖాన్‌ 2 వికెట్లు, హసన్‌ అలీ, షహీద్‌ అఫ్రీదీ, రవూప్‌ తలో వికెట్‌ పడగొట్టారు. షోయాబ్‌ మాలిక్‌ కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ లభించింది. టీ20 ప్రపంకప్‌ సూపర్‌ 12 గ్రూప్‌ 2లో వరుసగా 5 మ్యాచుల్లో విజయం సాధించి పాక్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఇక సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో అమితుమీకి సిద్ధమవుతుంది.

Social Share Spread Message

Latest News