Namaste NRI

హెచ్ఏఎల్ కీల‌క ప్ర‌క‌ట‌న

మిలిట‌రీ విమానాల ఉత్ప‌త్తి సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. అయిదు తేజస్ మార్క్‌1-ఏ ఫైట‌ర్ విమానాలు సంపూర్ణంగా సిద్ధంగా ఉన్న‌ట్లు పేర్కొన్న‌ది. భార‌తీయ వైమానిక ద‌ళం కోసం ఈ యుద్ధ విమానాల‌ను ఉత్ప‌త్తి చేశారు. అయితే ఫ్యాక్ట‌రీలో మ‌రో 9 విమానాలు రెఢీగా ఉన్నాయ‌ని, అమెరికా జ‌న‌ర‌ల్ ఎల‌క్ట్రిక్ సంస్థ స‌ర‌ఫ‌రా చేసే ఇంజిన్ల కోసం ఎదురుచూస్తున్న‌ట్లు హెచ్ఏఎల్ త‌న ప్ర‌క‌ట‌న‌లో చెప్పింది.

డెలివ‌రీ కోసం అయిదు విమానాలు రెఢీ అయ్యాయ‌ని, ఒప్పందం ప్ర‌కారం ఆ విమానాల‌ను రూపొందించామ‌ని, అద‌నంగా 9 విమానాల‌ను నిర్మించామ‌ని, అమెరికా ఇంజిన్ల కోసం ఎదురుచూస్తున్న బెంగుళూరుకు చెందిన హిందుస్తాన్ ఏరోనాటిక్స్ కంపెనీ వెల్ల‌డించింది. జీఈ సంస్థ నుంచి అనుకున్న తేదీ ప్ర‌కారం అయిదు ఇంజిన్లు అందిన‌ట్లు హెచ్ఏఎల్ చెప్పింది. ఎఫ్‌404 ఇంజిన్ల స‌ర‌ఫ‌రాలో ఆల‌స్యం వ‌ల్ల తేజ‌స్ మార్క్ 1ఏ జెట్ల డెలివ‌రీ ఆల‌స్యమైన‌ట్లు పేర్కొన్న‌ది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events