Namaste NRI

వీసాల జారీ షురూ : సౌదీ అరేబియా

ఈ ఏడాది హజ్‌ సీజన్‌ కోసం ఫిబ్రవరి 8 నుంచి వీసాల జారీ ప్రక్రియను ప్రారంభించినట్టు సౌదీ అరేబియాలోని హజ్‌ మంత్రిత్వ శాఖ, ఉమ్రా అధికారులు వెల్లడించారు. హజ్‌ వ్యవహారాల అధికారిక క్యాలెండర్‌ను విడుదల చేసిన అధికారులు, ఆ వెంటనే వీసాల జారీ, యాత్రికుల రిజిస్ట్రేషన్‌ను చేపడుతున్నారు. 2026 హజ్‌ సీజన్‌కు సంబంధించి యాత్రికుల తొలి బ్యాచ్‌ ఏప్రిల్‌ 18 నాటికి చేరుకుంటుందని సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారులు భావిస్తున్నారు. యాత్రికుల రాకకు ముందే మౌలిక సదుపాయాలు, సేవలు పూర్తిగా అందుబాటులో ఉండేలా చూసుకోవడాన్ని, నిర్దేశించిన షెడ్యూల్‌ను కచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని మంత్రిత్వ శాఖ పేర్కొన్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events