Skip to main content

Namaste NRI

ప్రధాని నరేంద్ర మోదీ తో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం భేటీ

ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. సెనేటర్‌ జాన్‌ కార్నిన్‌ నేతృత్వంలోని అమెరికా కాంగ్రెస్‌ బృందం మోదీని కలిసింది. ఇరు  దేశాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించింది. పెద్ద, విభిన్న జనాభా సవాళ్లు ఉన్నప్పటికీ కోవిడ్‌ పరిస్థితిని భారత్‌ అద్భుతంగా అదుపు చేసిందని యూఎస్‌ కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం ప్రశంసించింది. భారత్‌, అమెరికా మధ్య భాగస్వామ్య, ప్రజాస్వామ్య విలువలతో ముడిపడిన సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో యూఎస్‌ కాంగ్రెస్‌ స్థిరమైన మద్దతు, నిర్మాణాత్మక పాత్రను ప్రధాని మోదీ కొనియాడారు. రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య సంబంధాలు మరింతగా బలోపేతమవుతాయని ఆయన ఆకాక్షించారు.

Social Share Spread Message

Latest News