హిందువుల పవిత్రంగా జరుపుకునే కార్తీక పౌర్ణమి ఈ నెల 19న రాబోతుంది. అయితే అదే రోజున ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం దర్శమివ్వడం విశేషం. 580 ఏళ్ల తర్వాత ఆకాశంలో అరుదైన ఘట్టం పునరావృతం కాబోతోంది. ఈ నెల 19వ తేదీన సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం, దర్శనమివ్వనుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలలో ఈ చంద్రగ్రహణం చక్కగా కనిపిస్తుందని కోల్కతాలో ఎంపీ బిర్లా ప్లానెటోరియం రీసెర్చ్ అండ్ అకడమిక్ డైరెక్టర్ దేబిప్రసాద్ దురై తెలిపారు. సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం మధ్యాహ్నం 12:48 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.17 గంటలకు ముగుస్తుందని వివరించారు. ఇలాంటి గ్రహణం 580 సంవత్సరాల క్రితం అంటే 1440 ఫిబ్రవరి 18న చోటు చేసుకుందని వివరించారు. మళ్లీ ఇలాంటిదే చూడాలంటే 2669వ సంవత్సరం ఫిబ్రవరి 8 దాకా వేచి చూడాలన్నారు.














