Skip to main content

Namaste NRI

ఆ దేశంలో మ‌ళ్లీ లాక్‌డౌన్… వారికోస‌మే

కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆస్ట్రియా ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్‌ టీకా వేయించుకోని వారు ఇల్లు వదిలి బయటకు రావద్దంటూ ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఈ ఆంక్షలు పది రోజులపాటు అమలవుతాయని తెలిపింది. 12 ఏళ్లు పైబడి టీకా వేయించుకోని వారు మరీ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆంక్షలు విధించింది.  దేశ జనాభాలో కేవలం 65 శాతం మాత్రమే కోవిడ్‌ టీకా రెండు డోసులు వేయించుకున్నారు. కేసులు పెరిగితే ఆస్పత్రుల్లో సరిపోను వైద్య సౌకర్యాలు లేవని పౌరులను హెచ్చరించింది.

Social Share Spread Message

Latest News