అహింసా మార్గాన్ని అనుసరించి యావత్ ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన మహాత్మా గాంధీ స్మారక చిహ్నాలు ప్రపంచ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న భారతీయులు సంబురాలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర రాజధాని మెల్ బోర్న్ సిటీ శివారు ప్రాంతమైన రోలివిల్లేలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. విగ్రహం మెడ భాగాన్ని రంపం లాంటి వస్తువుతో కోశారు. తలను తెగ్గొట్టడానికి ప్రయత్నించడంతో విగ్రహం దెబ్బతినింది. భారత్, ఆస్ట్రేలియా ప్రభుత్వాల సహకారంతో రోవిల్లే కమ్యూనిటీ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఆసీస్ ప్రధాని స్కాట్ మారిసన్, భారత్ కౌన్సిల్ జనరల్ సహా పలువురు ముఖ్యులు వారం క్రితమే ఆవిష్కరించారు.
ప్రధాని ఆవిష్కరించిన గాంధీజీ విగ్రహాన్ని రెండో రోజే బద్దలు కొట్టేందుకు జరిగిన ప్రయత్నాన్ని చూసి యావత్ దేశం నివ్వెరపోయింది. మెల్ బోర్న్ లో గాంధీజీ విగ్రహంపై దాడిని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తీవ్రంగా ఖండిరచారు. ఇది అవమానకరమని, వివిధ దేశాల సంస్కృతులకు నెలవైన ఆస్ట్రేలియాలో ఇలాంటి దుశ్చర్యలను సహించబోమని అన్నారు. విగ్రహం ధ్వంసం చేసినవారిని గుర్తించేందుకు విక్టోరియా పోలీసులు ప్రయత్నాలు ఆరంభించారని, స్థానికంగా పోలీస్ కేసు కూడా నమోదైందని అధికారులు తెలిపారు. ఈ ఘటనను ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ తీవ్రంగా ఖండిరచారు. ఇది చాలా అవమానకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు.














