Namaste NRI

ఎన్నారైలకు భారత ప్రభుత్వం తీపి కబురు

విదేశాల్లో చిక్కుపోయిన వారికి, స్వదేశం రావాలని ప్లాన్‌ చేసుకున్న ఎన్నారైలకు భారత ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అంతర్జాతీయ ప్రయాణాకులపై ఉన్న క్వారంటైన్‌ నిబంధనల్లో అనేక సడలింపులు ఇచ్చింది. భారత ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.  లిస్ట్‌ ఏలో ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల క్వారంటైన్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది. దీంతో క్వారెంటైన్‌ భయాలు తొలగిపోయాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.

                వ్యాక్సినేషన్‌కి 99 దేశాలలో భారత్‌ అవగాహన కుదుర్చుకుంది. ఈ దేశాల్లో డబ్ల్యూహెచ్‌వో గుర్తించిన వ్యాక్సిన్లు అందిస్తున్నారు. వ్యాక్సిన్లు తీసుకున్న వారు ఎయిర్‌ సువిధా పోర్టల్‌లో తమ వ్యాక్సినేషన్‌కి సంబంధించిన రిపోర్టుని ఆప్‌లోడ్‌ చేయాలి. ప్రయాణానికి 72 గంటల ముందు జారీ చేసిన కోవిడ్‌ నెగటీవ్‌ రిపోర్టకు కూడా జత చేయాలి. ఈ రెండు పనులు చేసిన ప్రయాణికులు ఇండియా వచ్చిన తర్వాత 14 రోజుల నిర్బంధ క్వారంటైన్‌ ఉండక్కర్లేదు. లిస్ట్‌ ఏలో 99 దేశాల జాబితాలో విదేశీ ప్రయాణికులు ఎక్కువగా వచ్చే అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, ఖతర్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, యూఏఈ తదితర దేశాలు ఉన్నాయి. తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం విదేశాల నుంచి ప్రయాణికులతో పాటు ఉన్న ఐదేళ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే ప్రయాణం సందర్భంగా కోవిడ్‌రూల్స్‌ తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అక్టోబరు 15 నుంచే విదేశీ ప్రయాణికులను ఇండియాలోకి అనుమతి ఇస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events