
ఇరాన్ తో ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్ వ్యూహాత్మక ద్వీపంపై అమెరికా దాడులు చేసింది. టెహ్రాన్ ప్రతిదాడులకు దిగింది. తాజాగా ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో అగ్రరాజ్య ఎంబసీపై క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనలో హెలిప్యాడ్ ధ్వంసమైనట్లు ఇరాక్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు. క్షిపణి దాడితో ఎంబసీ ప్రాంతంలో దట్టమైన పొగ అలముకుంది. అమెరికాకు చెందిన అతిపెద్ద దౌత్య కార్యాలయాల్లో ఒకటైన బాగ్దాద్ కాంప్లెక్స్‌పై ఇరాన్ పదేపదే రాకెట్‌లు, డ్రోన్‌లతో దాడులు చేస్తోంది. తాజా ఘటన కూడా టెహ్రాన్ పనే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అగ్రరాజ్య రాయబార కార్యాలయం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.















