
మృణాల్ ఠాకూర్ తెలుగులో మూడు సినిమాలు చేస్తే, వాటిలో రెండు విజయాలను అందుకున్నాయి. త్వరలో ఆమె డెకాయిట్ సినిమాతో మరోసారి తెలుగుప్రేక్షకుల్ని పలకరించనున్నది. రిలీజ్కు ముందే ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఇందులో మృణాల్ పాత్ర కూడా సామాన్యంగా ఉండదట. బలమైన భావోద్వేగాలతో ఆమె పాత్రను తీర్చిదిద్దారట దర్శకుడు షానియల్ డియో. ఈ పాత్రతో ఆమె కెరీర్ మలుపు తిరగడం ఖాయమని ఇన్సైడ్ టాక్.
ఇక బన్నీ, అట్లీ సినిమాల్లోనూ మృణాల్ నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇదిలావుంటే, తాజా సమాచారం ప్రకారం రామ్చరణ్ పెద్ది లో స్పెషల్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట మృణాల్ ఠాకూర్. ఈ పాటలో జాన్వీ కపూర్ కూడా భాగం కానున్నదట. సినిమాకే ఈ పాట హైలైట్ అట. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.















