తెలంగాణ రాష్ట్ర డిజిపిగా సీనియర్ ఐపీస్ అధికారి
సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. డిజిపి కార్యాలయంలో ఆయనకు పోలీస్ ఉన్నతాధికారులు సాదర స్వగతం పలికారు. అనంతరం పండితులు వేద ఆశీర్వాదంతో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరేలా కృషి చేస్తానని తెలిపారు. అహర్నిశలు శాంతి భద్రతల కోసం శ్రమిస్తానని చెప్పారు. కొత్త టెక్నాలజీనీ మరింత సమర్థవంతంగా వాడుకొని పని చేస్తామని చెప్పారు.


ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని రాష్ట్ర డీజీపీగా నియమితులైన సందర్భంగా సీవీ ఆనంద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నూతన డీజీపీకి అభినందనలు తెలియజేశారు. పలువురు పోలీసు అధికారులు సీవీ ఆనంద్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

1991 ఐపీస్ బ్యాచ్ కు చెందిన సీవీ ఆనంద్ 2013 నుండి 2016 వరకు సైబరాబాద్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.2017 లో అదనపు డిజిపిగా పదోన్నతి పొందారు. 2024 లో మరోసారి హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.2025 సెప్టెంబర్ 27 నుండి హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈయన 2028 జూన్ వరకు డీజీపీగా కొనసాగనున్నారు.
















