లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన వినోదాత్మక చిత్రం సతీ లీలావతి. తాతినేని సత్య దర్శకుడు. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి విలేకరులతో ముచ్చటించింది. ప్రస్తుతం నేను సినిమాల్ని ఒప్పుకోవడం లేదు. ఫ్యామిలీకే టైం కేటాయిస్తున్నా. నా బాబుతోనే సమయం గడచిపోతున్నది. అందుకే సినిమాలకు కాస్త విరామం తీసుకుంటాను. ఈ సినిమా షూటింగ్ టైంలోనే తాను ప్రెగ్నెట్ అయ్యానని, టీమ్ అందరి సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా షూటింగ్ పూర్తిచేశానని చెప్పింది. ఈ సినిమాలో నేను డైరెక్టర్ పాత్రలో కనిపిస్తాను. ఈ కథలో వినోదంతో పాటు చక్కటి సందేశం ఉంటుంది. హృదయానికి హత్తుకునే ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉంటాయి అని తెలిపింది. రామ్‌చరణ్ ఎప్పుడూ సపోర్టివ్‌గా ఉంటారని, ఈ సినిమా ట్రైలర్‌ను ఆయన రిలీజ్ చేయడం సంతోషంగా అనిపించిందని ఆమె తెలిపింది.

వరుణ్‌తేజ్ రూపంలో తనకు అర్థం చేసుకునే భర్త దొరికాడని, ప్రస్తుతం తాము బాబుతో కలిసి హ్యాపీగా ఉన్నామని చెప్పింది. వరుణ్‌తేజ్‌తో కలిసి నటించాలనుంది. మేం రియల్‌లైఫ్‌లో కలిసే ఉన్నాం. కాబట్టి తెరపై మా జంట కొత్తగా కనిపించాలంటే కథ విభిన్నంగా ఉండాలి. అలాంటి వైవిధ్యమైన కథ దొరికితే భవిష్యత్తులో తప్పకుండా కలిసి నటిస్తాం అని లావణ్య త్రిపాఠి పేర్కొన్నది. ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకురానుంది.





























